-
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....
లోకమున వింత గాదిది
కాకర వారింటివెనుక గన్పడునిదియే
కేకియు గువ్వలు, చిలుకలు
కాకియు కోకిలము గలసి కాపురముండెన్
-
కాకమువలెనుండుహరిని
కోకిలవలెపాడురాధ కోరి వరించెన్
లోకులిదిజూచి దలచిరి
కాకియు గోకిలము గలసి కాపురముండెన్
Saturday, March 29, 2014
సమస్యా పూరణ...( 1355 - కాకియు గోకిలము గలసి కాపురముండెన్ )
Posted by sailaja at 7:40 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment